గిల్లిగిచ్చీ రెచ్చగొట్టింది మీరే.. ఫిరాయింపులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-15 06:55:49.0  )
గిల్లిగిచ్చీ రెచ్చగొట్టింది మీరే.. ఫిరాయింపులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్‌లో మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు సంజయ్ మాటలు ఉన్నాయన్నారు. బీజేపీ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు కూల్చిందో.. ప్రజలందరికీ తెలుసు అని చురకలు అంటించారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. తమకు తాముగా ఫిరాయింపులను ప్రోత్సహించలేదన్నారు.

ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ పొన్నం ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే వేరే పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వాన్ని గిల్లిగిచ్చీ రెచ్చగొట్టింది వాళ్లే అని పొన్నం అన్నారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఆనాడు కేసీఆర్ చేసింది ఏంటని ప్రశ్నించారు. నాడు మీరు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మేము చేస్తుంది కూడా సబబు అన్నారు.

Advertisement

Next Story