- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంత్రి పొన్నం
దిశ, హుస్నాబాద్ : జీవిత లక్ష్య సాధనలో ముందుకెళా వెళ్లాలో విద్యార్థులకు తెలియజేస్తూ ప్రేరణాత్మకమైన కథలు చెప్పి విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదపరిచారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంత్రి ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ , కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు. విద్యార్థినులను అందరినీ ఒక్క దగ్గరకు చేర్చి వారిలో ప్రేరణ కల్పించేలా జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని వారికి కథలు చెప్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. స్వయంగా విద్యార్థులతో కలిసి క్యూలైన్ లో నిల్చొని ఆహారం తీసుకున్నారు. వారితో కలిసి కింద కూర్చొని సామూహిక భోజనం చేశారు. వారికి తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. ప్రజా ప్రభుత్వం దశాబ్ద కాలం తర్వాత డైట్ చార్జీలు పెంచిన అనంతరం భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న విధానాన్ని చూశారు. ఉదయం అల్పాహారం , గుడ్లు, అరటిపండ్లు ,సాయంత్రం అందించే స్నాక్స్ చాలా బాగున్నాయని పేర్కొన్నారు. స్వయంగా మంత్రి రెండు గంటలకు పైగా విద్యార్థినులతో గడపడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.జీవితంలో గెలవాలంటే ఇప్పటి నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు పోవాలని అప్పుడే విజయం సాధించగలమని వారికి సూచించారు. అందరూ బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు , గ్రామానికి మన రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. చదువుల్లోనే కాదు ఆటల్లోనే ఇన్నోవేషన్ సైన్స్, రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో ప్రతి రంగంలో ముందుకు వెళ్లాలని విద్యార్థినులకు సూచించారు.