- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Ponnam: రూ.2 లక్షల రుణమాఫీ కాని వారికి తీపి కబురు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జబితాలో తమ పేర్లు లేవని పలువురు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
న్యాయంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. అధికారులు ప్రజా పాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ (Software)ను రూపొందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.2 లక్షల రుణమాఫీ (Loan Waiver) కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్‌ను ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కిరికీ నిరసన తెలిపే హక్కు ఉందని.. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే.. ఆ సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని మత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.