- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణ వచ్చినప్పుడు కాదు.. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారు’
దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినా ప్రజలకు స్వేచ్ఛ రాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ప్రజలు స్వేచ్చగా బతుకుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడిన తర్వాతే ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను తప్పకుండా తీరుస్తామని.. ఆ బాధ్యత తామే తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని మరోసారి స్పష్టంగా చెప్పారు. తాము తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. సమిష్టిగా ప్రజలకు ఏది మంచి చేస్తుందో అదే నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఏనాడూ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పదేళ్లు అధికారం ఇస్తే కాలయాపన చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకొని ఇప్పుడు అధికారం కోల్పోయి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే.. చూసి తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.