గతంలో టెంపుల్స్ లేవా? హనుమాన్ చాలీసాలు చదవలేదా? మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
గతంలో టెంపుల్స్ లేవా? హనుమాన్ చాలీసాలు చదవలేదా? మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవనివ్వమని అంటున్నారు.. మన ఆస్తులు ముస్లింలకు ఇస్తామని అబద్దాలు ఆడుతున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గతంలో హనుమాన్ టెంపుల్‌లు లేవా? హనుమాన్ చాలీసాలు చదవలేదా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చి పర్యటించవా? అని మంత్రి పొన్నం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో ఎంత మంది హిందువులకు న్యాయం చేశావ్? సంపద అంతా అదానీ, అంబానీలకు పంచి పెట్టారన్నారు.

నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి సూరత్ ఇప్పటికే గెలుచుకున్నాం అంటున్నాడని, బెదిరించి గెలుచుకోవడం కాదు.. ఓట్లతో గెలుచుకో అని మండిపడ్డారు. మరోవైపు భవిష్యత్‌లో రైతులకు సాగు నీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Advertisement

Next Story