చేనేత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ

by GSrikanth |   ( Updated:2024-04-08 13:08:43.0  )
చేనేత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన పొన్నం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చేనేత బోర్డును రద్దు చేసిందని గుర్తుచేశారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి తెలంగాణకు, కరీంనగర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. తామే చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసేలా జీవో తీసుకొచ్చామని తెలిపారు. నేతన్నల బకాయిలను విడుదల చేసే బాధ్యత తనదే అని భరోసా ఇచ్చారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్​హయాంలో చేనేతలకు ఇచ్చిన ఆర్డర్ల కంటే ఎక్కువ ఇస్తామని, నేతన్నలకు పని కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పొన్నం తెలిపారు. బీఆర్ఎస్​ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో సిరిసిల్ల నేతన్నలకు రూ.120 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు చేనేత కార్మికులను రెచ్చగొడుతున్నారని, శవాల పేరుమీద రాజకీయాలు చేయకండని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed