రూ.2 లక్షల రుణమాఫీ వేళ రైతులకు మంత్రి పొన్నం కీలక పిలుపు

by Satheesh |
రూ.2 లక్షల రుణమాఫీ వేళ రైతులకు మంత్రి పొన్నం కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టింది. మొత్తం మూడు దశల్లో రుణమాఫీ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న రేవంత్ సర్కార్.. ఈ నెల 18న లక్ష లోపు, ఇవాళ (మంగళవారం) లక్షన్నర లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసింది. అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేశారు. ఈ క్రమంలో సెకండ్ ఫేజ్ రుణమాఫీ సందర్భంగా రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం చారిత్రాత్మకమని అన్నారు. రైతులకు రూ.2 లక్షల లోన్ మాఫీకి ఆమోదం తెలిపిన కేబినెట్‌లో భాగస్వామ్యం కావడం మరుపురాని ఘట్టమని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతో ఉపయోగపడుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story