- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Household surveyఇంటింటి సర్వేలో మంత్రి పొన్నం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Comprehensive household household survey)రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ Minister Ponnam Prabhakar తన నియోజకవర్గం హుస్నాబాద్ పట్టణంలో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను మంత్రి పొన్నం పరిశీలించారు. మోసర్ల ప్రతాప్ రెడ్డి నివాసంలో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల సేకరణను పొన్నం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పట్ల ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. అందరూ ఎన్యూమరెటర్లకు సహకరించి తమ కుటుంబ వివరాలు అందించాలని కోరారు.
అనంతరం హుస్నాబాద్ పట్టణంలో దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న బంజారా భవన్ కి రోడ్డు సమస్య విషయమై స్థల పరిశీలన చేశారు. బంజారా భవన్ కి గుట్ట మీద నుండి వెళ్ళే దారిలో రోడ్డు క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్మిస్తున్న అనిమేని మండపం నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణాలకు సంబంధించి ఆలయ ఈవో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.