Minister Ponnam: ప్రయాణికులను ఇబ్బంది పెడితే బస్సులు సీజే.. మంత్రి పొన్నం వార్నింగ్

by Shiva |
Minister Ponnam: ప్రయాణికులను ఇబ్బంది పెడితే బస్సులు సీజే.. మంత్రి పొన్నం వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) పండుగల వేళ ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించబోమని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులను కూడా సీజ్ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హెచ్చరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా టికెట్ ధరపై అదనపు చార్జీలు వసూలు చేస్తే వెంటనే ప్రయాణికులు తమ దృష్టి తీసుకురావాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ చార్జీలు (Regular Charges) కాకుండా.. ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తే బాధ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఆర్టీసీ (RTC) అధికారులు రహదారులపై తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి (Sankranthi) పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ (TGS RTC) మొత్తం 6,432 స్పెషల్ సర్వీసులను నడిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Next Story

Most Viewed