సామాన్యుడిపై మంత్రి బూతుపురాణం.. మంత్రి పొన్నం మరో ఆడియో కాల్ లీక్

by Prasad Jukanti |
సామాన్యుడిపై మంత్రి బూతుపురాణం.. మంత్రి పొన్నం మరో ఆడియో కాల్ లీక్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. మహిళా తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో దుమారం మరువక ముందే మంత్రి మాట్లాడినట్లుగా పేర్కొంటూ మరో ఆడియో రికార్డు వైరల్ అవుతోంది. తిరుపతి గౌడ్ అనే వ్యక్తి మంత్రి పొన్నంకు ఫోన్ చేసి తమ గ్రామంలోని సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి మాట్లాడుతుంటే మంత్రి అతడిపై దురుసుగా మాట్లాడారు. బూతులతో రెచ్చిపోయారు. దీంతో మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమస్యను చెప్పుకుందామని ఫోన్ చేసిన సామాన్యుడిపై మంత్రిగారి బూతుపురానం అంటూ ఆ ఆడియో క్లిప్పింగ్ ను వైరల్ చేస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కోసం ఇవ్వొద్దని మంత్రి తహసీల్దార్ ను ఆదేశిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియో లీక్ కాగా దీని వెనుక స్థానిక ఆర్డీవో ఉన్నారని మంత్రి పొన్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరువక ముందే మరో ఆడియో బయటకు రావడం ఎంపీ ఎన్నికల వేల కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని మంత్రి తన తీరు మార్చుకోకుంటే మొదటికే మోసం తప్పదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే మంత్రికి సంబంధించినవిగా పేర్కొంటున్న ఆడియో క్లిప్పింగ్ లు వరుసగా బయటకు రావడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story