ఇందిరమ్మ ఇళ్లు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరా!.. మంత్రి పొంగులేటి క్లారిటీ

by GSrikanth |
ఇందిరమ్మ ఇళ్లు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరా!.. మంత్రి పొంగులేటి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్లపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. ఈ నెల 11వ తేదీన పథకం ప్రారంభం కాబోతోందని మరోసారి స్పష్టం చేశారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలని ఆదేశించారు.

ప్రజా పాలన దరఖాస్తులు, రేషన్ కార్డులు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అన్నారు. కాగా, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3,000ల కోట్ల రుణం సమీకరిస్తోంది. ఈ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు సర్కార్ వెల్లడించింది. రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రానున్నాయి.

Advertisement

Next Story