- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు వికసించాలి: పొంగులేటి
దిశ, వెబ్ డెస్క్: కొత్త ఏడాది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, వారి జీవితంలో సంక్షేమం విలసిల్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఆయన.. తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలని, రైతన్నలందరికీ భరోసా లభించాలని, గృహాలన్నీ 'జ్యోతి'తో వెలగాలని, ప్రతి కుటుంబానికీ సొంతింటి కల నెరవేరాలని కోరుకున్నారు.
విద్యారంగం అంతర్జాతీయ ప్రమాణాలతో వికసించాలని, ఆరోగ్య ‘ధీమా’ దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ 'చే'యూత లభించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు నయా జోష్‌తో అర్హుల దరిచేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. అర్హులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పథకాలన్నీ వారి చెంతకే చేరేలా పారదర్శక పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వు చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.