Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌ విచారణకు రంగం సిద్ధం.. అక్కడినుంచి అనుమతి రావడమే ఆలస్యం

by Gantepaka Srikanth |
Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌ విచారణకు రంగం సిద్ధం.. అక్కడినుంచి అనుమతి రావడమే ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ రేసింగ్‌‌(Formula E Racing)లో జరిగిన అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్‌(KTR)కు ఏం పని? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్‌(E Racing)లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించిందని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు గవర్నర్‌కు ఏసీబీ విజ్ఞప్తి చేసిందని.. గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌(KTR)ను ఏసీబీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. కేసుల మాఫీ కోసమే కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయని విమర్శించారు. విదేశాలకు ఏ చట్టం ప్రకారం కేటీఆర్ రూ.55 కోట్లు పంపారని అడిగారు.

ఈ కార్ రేస్(E Car Race) కోసం కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారు. అందుకే రెండ్రోజుల్లో జరిగే పరిణామాలను ముందే ఊహించి ఢిల్లీకి వెళ్తున్నారని అన్నారు. పదే పదే తనను బాంబుల మంత్రి అంటున్నారు.. ఏం బాంబుకు భయపడి ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. అంతేకాదు.. కేసీఆర్‌కు కూడా పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు జారిపోకుండా.. వారిలో కొంతైనా ధైర్యం నింపాలనే కేసీఆర్ అలా మాట్లాడారని అన్నారు. అసలు ఎవరి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా కట్టారు కాబట్టే కూలిపోయిందని తెలిపారు.

Advertisement

Next Story