- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపే అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు. యువతకు ఇచ్చిన హామీ ప్రకారం విడుదల చేయబోతున్నామని తెలిపారు. అంతేకాదు.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడి విడిగా ఇస్తామని అన్నారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులు ఇషాసింగ్, నిఖత్, సిరాజ్‌కు 600 గజాల ఇంటి స్థలం, విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. మరో అధికారి మురళి కుమారుడికి గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళ వయనాడ్‌లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చిందని పొంగులేటి చెప్పుకొచ్చారు.