చిరకాల కోరిక నెరవేరబోతోంది.. శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |
చిరకాల కోరిక నెరవేరబోతోంది.. శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ -2 ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని అన్నారు. ఈనెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టును మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పాలనలో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వబోమని హామీ ఇచ్చారు. ప్రతీ రూపాయిని ఎంతో జాగ్రత్తగా వాడతామని అన్నారు. ఆగష్టు చివరలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తామని కీలక ప్రకటన చేశారు.

Advertisement

Next Story