వరంగల్ అభివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. రైల్వే జీఎంకు పొంగులేటి రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
వరంగల్ అభివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. రైల్వే జీఎంకు పొంగులేటి రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం కలిశారు. నూతన రైల్వేమార్గంలోని అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు. నూతన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని అన్నారు. వరంగల్ అభివృద్ధి దృష్ట్యా అలైన్‌మెంట్ మార్చాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణలోని ప్రధాన నగరాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్ అవసరాలు, ప్రణాళికల్లో భాగంగా నగరాలను అభివృద్ది చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నాలుగో నగరం నిర్మించనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించారు. తాజాగా.. మధ్య తెలంగాణలో ప్రధాన నగరమైన వరంగల్ నగర అభివృద్ధిపైనా రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ సిటీని అభివృద్ది చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే జీఎంను మంత్రి పొంగులేటి కలిశారు.

Advertisement

Next Story