బీఆర్ఎస్‌లోకి MLA తెల్లం..? పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

by Satheesh |   ( Updated:2024-07-30 13:36:53.0  )
బీఆర్ఎస్‌లోకి MLA తెల్లం..? పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయిన బండ్ల.. కొన్ని రోజుల్లోనే యూ టర్న్ తీసుకుని తిరిగి బీఆర్ఎస్ గూటికీ వచ్చారు. బండ్ల రిటర్న్ ఎపిసోడ్‌తో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మరి కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో రానున్నట్లు ప్రచారం మొదలైంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇవాళ భేటీ కావడంతో ఆయన కూడా తిరిగి గులాబీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లం వెంకట్రావు పార్టీ మార్పు వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లరని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. పాత పరిచయాలతోనే బీఆర్ఎస్ నేతలను కలిసి ఉంటారని అన్నారు. పొంగులేటి క్లారిటీతో తెల్లం వెంకట్రావు ఘర్ వాపసీ వార్తలకు తెరపడింది.

Advertisement

Next Story

Most Viewed