ఎన్నికల అఫిడవిట్‌లో కారు లేదని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి.. మొత్తం ఆస్తి ఎంతంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-09 07:16:46.0  )
ఎన్నికల అఫిడవిట్‌లో కారు లేదని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి.. మొత్తం ఆస్తి ఎంతంటే..?
X

దిశ, మేడ్చల్ టౌన్: ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఇక, నామినేషన్ పత్రాలలో కొంత మంది నాయకులు తమకు ఇల్లు లేదని, మరికొంత మంది కారు లేదని పేర్కొనడంతో ప్రజలు అవ్వాక్కవుతున్నారు. తాజాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి చామకూర మల్లారెడ్డి తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో ఆసక్తికర విషయాన్ని తెలిపారు. తనకు రూ.95 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. అయితే చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని తెలిపారు. అంతేకాదు.. తనకు కారు కూడా లేదని అఫిడవిట్‌లో పొందుపరిచారు.

Advertisement

Next Story