'విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా మునుగోడులో జరిగేది ఇదే'

by GSrikanth |
విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా మునుగోడులో జరిగేది ఇదే
X

దిశ, మేడ్చల్ టౌన్: రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా.. గెలిచేది టీఆర్ఎస్‌ పార్టీనే అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులోనూ బీజేపీనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. గురువారం మేడ్చల్ మండల పరిధిలో కొత్త పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో విపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 36 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, ఎంత నష్టం వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కష్టాలు తీరుస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా, వైస్ ఎంపీపీ వెంకటేష్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్‌లు రణదీప్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed