- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా మార్కెట్‌లో వెజ్, నాన్‌వెజ్ రెండు అవైలబుల్: మంత్రి కేటీఆర్
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత మార్కెట్లు శరవేగంగా ఏర్పాటవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా మార్కెట్‌లలో శాకాహారంతోపాటు మాంసాహారం కూడా లభిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర పురపాలక శాఖ నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈమేరకు ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల ఫొటోలను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు, పురపాలక ఛైర్మన్లను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో అభినందించారు. కాగా, అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లోను రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Advertisement
Next Story