- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోదరి కవితపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: మళ్లీ అధికారంలోకి రాగానే ఉమెన్ మేనిఫెస్టోను డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఐటీసీ కాకతీయలో ఆదివారం ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలకు విద్య కోసం యూనివర్సిటీలో, ఉపాధి కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఐదేళ్లకు ఉమెన్ మేనిఫెస్టోను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంటర్ ప్రైమ్ నూర్ కోసం ‘వి’ హబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళల పాత్ర కీలకమన్నారు. తన సోదరి, ఎమ్మె్ల్సీ కవిత గడుసున్న మహిళ అని కేటీఆర్ కొనియాడారు. సంపద సృష్టించాలని వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామన్నారు. అమ్మ ఒడితో శిశు మత మరణాలు తగ్గాయి అన్నారు. ఇంటింటికి మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆరోగ్య మహిళ ప్రోగ్రాం, సైబర్ సేఫ్టీ, భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌తో రక్షణ కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యను అందించడంతోనే ఐఐటీలో విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారన్నారు. డీప్ ఫేక్ వీడియోలతో మహిళలతో పాటు రాజకీయ నాయకులకు ప్రమాదకరమన్నారు.