- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాంక్ బండ్ శివకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంటికి..
దిశ, వెబ్‌డెస్క్: ట్యాంక్ బండ్ శివ అంటే హైదరాబాద్ లో చాలా పాపులర్. హైదరాబాద్ లో అతడి పేరు చాలామందికి తెలుసు. ట్యాంక్ బండ్ పై నివాసం ఉంటే శివ.. హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసేవారిని కాపాడుతూ ఉంటాడు. దాంతో పాటు ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలను బయటకు తీస్తూ ఉంటాడు. ఇప్పటివరకు చాలామందిని శివ కాపాడాడు. ట్యాంక్ బండ్ పై చిన్న గుడిసెలో శివ నివాసం ఉంటూ తన సేవలను అందిస్తున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసుకునేవారి ప్రాణాలను కాపాడుతూ ప్రజల మన్నలను పొందుతున్నాడు. వ్యర్థాలతో నిండిపోయి కంపు కొట్టే హుస్సేన్ సాగర్ లో ఈత కొడుతూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాడు.
అయితే తాజాగా ట్యాండ్ బండ్ శివకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. అతని ఆర్థిక పరిస్థితి, కష్టాలను మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్.. అతడికి గుడ్ న్యూస్ తెలిపాడు. నెక్లెస్ రోడ్ లో ట్యాంక్ బండ్ శివకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం తరపున కేటీఆర్ ఇప్పించారు. దీనిపై ట్యాంక్ బండ్ శివ అనందం వ్యక్తం చేశాడు. తన కష్టాలను తెలుసుకుని మంత్రి కేటీఆర్ సహాయం చేశారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ట్యాంక్ బండ్ శివ చెప్పుకొచ్చాడు. అయితే కేటీఆర్ గృహప్రవేశానికి రాకపోవడం కొంచెం బాధ అనిపించిందని శివ ఆవేదన చెందాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్.. త్వరలోనే ట్యాంక్ బండ్ శివ ఇంటికి వెళతానని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ శివ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.