- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ ఔదార్యం.. పేద విద్యార్థులకు ఆర్థికసాయం
దిశ, తెలంగాణ బ్యూరో: పేద విద్యార్థినులకు ఆర్థికసాయం అందజేసేందుకు మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. కోర్సులకు పూర్తయ్యే ఖర్చును అందజేస్తామని హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కావేరి, శ్రావణిలు పేద విద్యార్థులు. వారిద్దరు మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్నారు. ఫీజు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నారు. ఆదివారం వారికి ప్రగతి భవన్‌కు పిలిపించుకొని ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా, వారిద్దరూ టీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఎస్ మోడల్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. కావేరి 95శాతంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా, శ్రావణి 97శాతంతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటీలో బీటెక్ (ఈసీఈ)లో ప్రవేశం పొందింది. మెరిట్ ఆధారంగా ఉచిత సీట్లు పొందినప్పటికీ, వారు హాస్టల్ మరియు మెస్ ఫీజుతో సహా ఇతర ఫీజులను చెల్లించలేక పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న కేటీఆర్ ఆర్థికసాయం అందజేసేందుకు ముందుకు వచ్చారు. కోర్సులు పూర్తయ్యేవరకు ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. బాలికల యోగక్షేమాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఫీజులకు సంబంధించిన చెక్కులను సైతం అందజేశారు.