- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో సీఆర్‌పీఎఫ్ పరీక్షలు రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాగా, వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది.
స్థానిక యువత ప్రమేయాన్ని పెంచే దిశగా కేంద్ర హోంమంత్రి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో వెల్లడించింది. దీంతో హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.
I thank HM @AmitShah Ji for agreeing to conduct the CRPF examination in 13 regional languages including Telugu
— KTR (@KTRBRS) April 15, 2023
This will surely help thousands of aspirants from Telugu speaking states https://t.co/Vxg8QtHPCC