లోకేష్ కాల్ చేశాడు.. చంద్రబాబు అరెస్ట్‌‌తో మాకేం సంబంధం..? మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-26 11:45:37.0  )
లోకేష్ కాల్ చేశాడు.. చంద్రబాబు అరెస్ట్‌‌తో మాకేం సంబంధం..? మంత్రి KTR కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు ఏం సంబంధం అని, బాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాలో పంచాయితీ ఆంధ్రాలో తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య అన్నారు. బాబు అరెస్ట్ రెండు రాజకీయ పార్టీల తగాదా అని.. ఆ రెండు పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. తెలంగాణలో కొట్లాడుతామంటే ఊరుకోమని, ఏపీకి వెళ్లి పోటాపోటీగా చేసుకోవాలని సూచించారు. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు, ధర్నాలు చేసుకోవాలని కేటీఆర్ సెటైర్ వేశారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఎవరు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్ అందరూ మాకు స్నేహితులే అని ఎవరితో మాకు శత్రుత్వం లేదన్నారు. అనవసరంగా ఇక్కడ ఉన్న సెటిలర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. హైదరాబాద్‌లో ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేశారని.. అయితే శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండాలనే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఐటీ కారిడార్ డిస్టర్బ్ కావొద్దనే అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదన్నారు.

Read More..

తమిళి సై గవర్నర్ పదవికి అర్హురాలు కాదు.. మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story