వీఆర్ఏలను చర్చకు పిలిచిన మంత్రి కేటీఆర్

by GSrikanth |   ( Updated:2022-09-13 08:05:56.0  )
వీఆర్ఏలను చర్చకు పిలిచిన మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: పే స్కేల్ అమలు చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, సీనియర్ వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి, కారుణ్య నియామకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం అసెంబ్లీ సమావేశం జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు భారీగా అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా.. వీఆర్ఏలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో అదుపుచేయలేని పరిస్థితిలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చకముందే మంత్రి కేటీఆర్ స్పందించారు. వీఆర్ఏలను చర్చకు పిలిచారు. సమస్యల గురించి చర్చించేందుకు 10 మంది వీఆర్ఏలను ఆహ్వానించారు.

Also Read : 'వీఆర్ఏలది అర్థంలేని ఆందోళనైతే.. నీది నరంలేని నాలుకా?'


Advertisement

Next Story

Most Viewed