- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి కొప్పులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మరో రాష్ట్ర మంత్రికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను మంగళవారం కోర్టు కొట్టివేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. దాంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ అప్పట్లోనే రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేసారు.
ఈ క్రమంలో రీ కౌంటింగ్ జరిపిన అధికారులు కొప్పుల ఈశ్వర్ నే విజేతగా ప్రకటించారు. కాగా, ఓట్ల లెక్కింపులో, కొప్పుల ఈశ్వర్ ను విజేతగా ప్రకటించటంలో అవకతవకలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కొప్పుల ఈశ్వర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించాలని కోరారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగితోంది. కాగా, ఇటీవల కొప్పుల ఈశ్వర్ తనపై అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలంటూ మధ్యంతర పిటిషన్ వేశారు. దీనిని కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.