- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR ఏ క్షణమైనా బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ఛాన్స్: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ పోకిరి సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన ‘ఎప్పుడు వచ్చామా అన్నది కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా’ అనే డైలాగ్‌తో బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పడొచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమని.. అలాగే రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని అన్నారు. మేము దింపిన బుల్లెట్ కేసీఆర్‌కి దిగిందని.. దీంతో ఆయన సీఎం సీటు పోయిందని సెటైర్ వేశారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతేనని ఆయన సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. 83 ఏండ్ల ఖర్గే, ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారు. కేసీఆర్‌కు ఏమైంది.. సభకు ఎందుకు హాజరవ్వడం లేదని ప్రశ్నించారు. సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లేనని హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చామని, సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్‌ని ఎందుకు ఓడించలేదని నిలదీశారు. హరీష్ రావు, కేటీఆర్‌కి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదన్నారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేసేటట్టు ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయని.. అందుకే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్ళాడని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.