- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క కాంగ్రెస్ పార్టీకే తెలంగాణను పాలించే హక్కు: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ఒక్క కాంగ్రెస్ పార్టీకే రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ను ఎదుర్కొలేక కేసీఆర్ కోర్టులకు వెళ్తున్నారని విమర్శించారు. సోమవారం మహబూబ్ నగర్‌లో జిల్లాలో పర్యటించిన కోమటిరెడ్డి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ పాలమూరు జిల్లాపై పెట్టిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. మేం నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే బీఆర్ఎస్ వాళ్ల జీవితాలతో రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు.