- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Komatireddy: పాదయాత్రపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లే కాదు.. బీఆర్ఎస్(BRS) నేతల్లో ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం కార్యక్రమం ఆగదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మరుస్తామని అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి చార్మినార్ వరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కలిసి పాదయాత్ర చేస్తామని కోమటిరెడ్డి(Komatireddy) కీలక ప్రకటన చేశారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ నేతలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తరిమి తరిమి కొడతారని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్(BRS).. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. అన్ని అప్పులు చేసి కూడా మూసీ(Musi) అభివృద్ధికి కనీసం రూ.20 కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. మూసీ ప్రజల బాధలు తెలుసుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారని అన్నారు. సీఎం పాదయాత్రను చూసి ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.