Minister Komatireddy: అదే జరిగితే రాజకీయాల్లో కొనసాగడం వేస్ట్.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
Minister Komatireddy: అదే జరిగితే రాజకీయాల్లో కొనసాగడం వేస్ట్.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ ప్రక్షాళనపై ప్రజల్లో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) యాదాద్రి పర్యటనకు వస్తున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాప్రతినిధులతో సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్ధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాళ్లు, చేతులు వంకర్లుపోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే.. ఆనాడు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కోట్లమంది మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం కల్పించామని అన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని, లక్షలాది గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 22 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని, 50 వేలమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పించామని, దేశంలో ఎక్కడాలేని విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్షల మందిని నైపుణ్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చేసింది ప్రజలకు చెప్పకోవాల్సిన అవసరం ఇప్పుడున్న రోజుల్లో తప్పకుండా ఉందని అన్నారు.

మల్లన్నసాగర్(Mallanna Sagar) నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా అందించేందుకు రూ.210 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెలకు మంత్రి సూచించారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ బాధితులను రెచ్చగొట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నాయని.. పార్టీ కేడర్‌ను యాక్టీవ్ చేసి ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని నాయకులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సూచించారు.

నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన మూసీ శుద్ధీకరణను చిన్న చిన్న కారణాలతో అడ్డుకొని ప్రభుత్వాన్ని బద్నా చేయాలని ప్రయత్నించడం క్షమించరానిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పోరాడకపోతే దశాబ్ధాల మూసీ మురికి ప్రజల్ని మరింత పీడిస్తుందని.. అదే జరిగితే రాజకీయాల్లో కొనసాగడం దేనికని అన్నారు. అన్ని జిల్లాల ప్రజలు గోదావరి, కృష్ణానీళ్లతో వ్యవసాయం చేస్తూ, తాగునీటిని వాడుకుంటుంటే.. భయంకరమైన రసాయనాలు కలిసిన మురికినీళ్లను ఉమ్మడి నల్గొండ ప్రజలు ఎందుకు వాడుకోవాలని ఆయన ప్రశ్నించారు. అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని సూచించారు.

Advertisement

Next Story