- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి మాటలు నమ్మకండి.. మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆదివారం ఉదయం బైక్ రైడింగ్ చేస్తూ పలు కాలనీలను సందర్శించారు. ముందుగా ఐదేళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆ తర్వాత గృహజ్యోతి లబ్ధిదారులతో మాట్లాడి జీరో బిల్ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాకముందే 4 గ్యారంటీలు అమలు చేశామని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా విస్మరించబోమని చెప్పారు. ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేస్తామని మాటిచ్చారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు హితవు పలికారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షల 53 వేల మందికి గృహజ్యోతి కింద మార్చి 1 నుండి ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లు మార్చి 11న ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్లలో 7లక్షల కోట్లు అప్పులు చేస్తే.. ఆర్థికంగా ఇబ్బందులున్నా హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి చెప్పారు.