- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మెడల్ కాదు.. మోడీకే డైమండ్ ఇవ్వాలి’.. ప్రధానిపై మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆర్ఆర్ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ నడుస్తోందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ లేదని.. ఆర్ఆర్ ట్యా్క్స్ వసూల్ చేస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. దేశంలో అదానీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంబానీ, అదానీలకు ప్రధాని మోడీ దేశ సంపద దోచిపెడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక అదానీ కంపెనీ దేశంలో రెండో స్థానానికి ఎగిదిందని ఆరోపించారు.
అవినీతిలో పతకాలు కాంగ్రెస్‌కు కాదని.. మోడీకే డైమండ్ ఇవ్వాలని సెటైర్ వేశారు. కాగా, ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఢిల్లీకి ఏటీఏంగా మారిందని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు పై విధంగా కౌంటర్ ఇచ్చారు.