తెలంగాణ మహిళలకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్

by GSrikanth |
తెలంగాణ మహిళలకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర ఆలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. శివరాత్రి పర్వదినాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోగా ఛాయ సోమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.

మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. మహిళలకు ఉపయోగపడేలా ఉచిత కరెంట్, ఉచిత సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు కూడా ఇస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story