నీది.. నీ బావమరిది కొట్లాట బయటపెట్టమంటావా..? మంత్రి కోమటిరెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-12-20 12:28:19.0  )
నీది.. నీ బావమరిది కొట్లాట బయటపెట్టమంటావా..? మంత్రి కోమటిరెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సభలో హరీశ్ రావు సెటైర్లు వేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి, హరీశ్ రావుకు మధ్య మాటల యుద్ధం జరగగా.. ఇంతలో కలగజేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హరీశ్ రావు మీకు ఏం పని లేదా అంటూ కౌంటర్ ఇచ్చారు.

మొన్న కేటీఆర్ సైతం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని, మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు మీకెందుకని ప్రశ్నించారు. మీరు చెబుతున్న విషయంలో గతంలో ఎప్పుడో జరిగిపోయిందని, పార్టీ సిద్ధాంతం ప్రకారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గడిచిన పదేళ్లలో ఏం చేశారో చెప్పకుండా మా పార్టీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. నీవు నీ బావమరిది ఎలా కొట్టుకున్నారో చెప్పమంటావా అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాని హెచ్చరించారు.

Advertisement

Next Story