- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓ పెద్ద దొంగ: మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకోగా.. సభ బయట కూడా జగదీష్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి చిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నా దగ్గర రూ.10 వేలు, రూ.20 వేలు తీసుకునేవాడని.. అలాంటిది ఇవాళ కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ దగ్గర 80 ఎకరాలు అక్రమంగా సంపాదించారని, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో తాను అన్నట్లుగా జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమేనని మరోసారి పునర్ఘాటించారు. కాగా, అసెంబ్లీలో జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడిచిన విషయం తెలిసిందే. జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించగా.. అందుకు కౌంటర్‌గా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే అసెంబ్లీలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. దీనికి స్పందించిన కోమటిరెడ్డి.. ఆరోపణలు నిరూపించకపోతే తన మంత్రి పదవికి రిజైన్ చేస్తామని ప్రతి సవాల్ విసిరారు. జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డిల డైలాగ్ వార్‌తో ఇవాళ అసెంబ్లీ దద్దరిల్లింది.