నా సొంత ఊళ్లోనే మిషన్ భగీరథ రావడం లేదు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-22 06:45:08.0  )
నా సొంత ఊళ్లోనే మిషన్ భగీరథ రావడం లేదు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నల్లగొండ బ్యూరో : నల్గొండ జిల్లాలోని నా సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లెంలలో మిషన్ భగీరథ నీరు అందడం లేదు. నా ఊర్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ పథకం అందడం లేదని, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story