Komati Reddy: బండెక్కి మరోసారి వార్తల్లో నిలిచిన మంత్రి కోమటి రెడ్డి

by Ramesh Goud |
Komati Reddy: బండెక్కి మరోసారి వార్తల్లో నిలిచిన మంత్రి కోమటి రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ లాంటివి నడిపి ప్రత్యేక ఆకర్షణగా వార్తల్లో నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పడు వీధుల్లో ఫోర్ వీల్ బైక్ నడిపి మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణ అధ్యక్షలు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఫోటోలతో ఫోర్ వీల్ బైక్ అక్కడ దర్శనమిచ్చింది. కార్యకర్తల సమావేశం అనంతరం మంత్రి నల్లగొండ పట్టణ వీధులో ఆ ఫోర్ వీల్ బైక్ నడిపించారు. తమ నాయకుడు వీధుల్లో బైక్ నడిపించడం చూసి ఆనందంతో ఆయన వెంట కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరిలివెళ్లారు. ఎప్పుడూ బిజీ గా ఉండే మంత్రి కోమటిరెడ్డి సరదాగా బైక్ నడిపించడం చూపరులను ఆకట్టుకుంది. ఈ సంఘటనను చిత్రీకరించిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story