- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు కిషన్ రెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతుగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇకపైనా ఈ సహాయాన్ని కొనసాగిస్తూ ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (పార్ బాయిల్డ్ రైస్) సేకరించాలని ఆదివారం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన లేఖ రాశారు. 2015-16 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 5.35 లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ ధాన్య సేకరణ ద్వారా లబ్ధి పొందారని, గత సీజన్‌లో 20 లక్షల మంది తెలంగాణ రైతులు లబ్ధిపొందారని కిషన్ రెడ్డి ఆ లేఖలో గుర్తుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో రాష్ట్రం నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఉపక్రమించాలని పీయూష్ గోయల్‌ను కిషన్ రెడ్డి కోరారు.
Also Read..
సారీ.. మరోసారి జరగకుండా చూసుకుంటా.. బండి సంజయ్ అరెస్టుపై కరీంనగర్ సీపీ