హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలని మంత్రి జూపల్లీ డిమాండ్

by Mahesh |   ( Updated:2024-02-17 11:11:12.0  )
హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలని మంత్రి జూపల్లీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రులు చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ సమాధానాలు చెబుతున్నారు. ఈ క్రమంలో చర్చను తప్పుదోవ పట్టించేలా హరీశ్ రావు మాట్లాడుతున్నాడని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను శ్వేతపత్రం రూపంలో సభలో ఉంచామని.. తప్పు ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేశారు. కానీ హరీశ్ రావు మాత్రం ఆ ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ మంత్రులు చేసిన ఆరోపణలను పట్టుకొని చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.

దీంతో సభలో మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కలుగజేసుకుని.. ఇంతటి భారీ తప్పిదాలకు కారణమైన హరీశ్ రావుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభలో గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని అన్నారు. బీఆరఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పజెప్పిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story