- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహకం.. మంత్రి జగదీశ్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రూఫ్ టాప్ ద్వారా సౌర విద్యుత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. శాసనసభలో ఆదివారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కోరుకంటి చందర్, మహేష్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరులు సౌర, పవన, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే ప్రక్రియలో భాగంగా సోలార్ టెండర్లు, ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ, సౌర రూఫ్ టాప్ ట్రాకింగ్, నెట్ మీటరింగ్ వంటి వినియోగ సౌలభ్యం మొదలైన సదుపాయాలతో పునరుత్పాదక ఇంధన సామర్థ్య జోడింపులతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి నాటికి పునరూత్పాదక ఇంధన సామర్థ్యం 6,159 మేఘావాట్లు నమోదైందని ఆయన తెలిపారు. డిస్కంలకు 287 మెగావాట్ల సౌర రూఫ్ టాప్ సామర్థ్యాన్ని అందించిందని తెలిపారు. జనవరి చివరినాటికి 5,748 మెగావాట్ల సౌర విద్యుత్, 128.10 మెగావాట్ల పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లు ఆయన సభకు వివరించారు. రాబోయే రెండేండ్లలో 2,500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.