- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు: మంత్రి హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: "తెలంగాణ పై కేంద్రం తీవ్ర వివక్ష చూపింది. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. ఒక్కో కాలేజీకి 200 కోట్లు మంజూరు చేసింది. మనకు మొండి చేయి చూపింది. మన విజ్ఞప్తులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైద్యారోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కి పెంచుకుంటున్నాం. ఉక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. వైద్య విద్య కోసం భాష రాకపోయినా ఉక్రెయిన్, చైనా తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అని మంత్రి హరీష్ రావు అన్నారు.
కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానున్నదన్నారు. బస్తీ దవాఖానలు గొప్పగా సేవలు అందిస్తున్నాయని, కేసీఆర్ ఆలోచనతో దేశంలో మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించిందన్నారు. దేశం మొత్తం ఈ విధానం అనుసరించాలని సూచించిందన్నారు. 350 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ప్రస్తుతం 259 సేవలు అందిస్తున్నాయని, త్వరలో మిగతా చోట్ల అందుబాటులోకి వస్తాయన్నారు. బస్తీ దవాఖానల నుండి టెలీమెడిసిన్ సేవలు సైతం అందిస్తున్నామని, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు.
ఉచితంగా 57 రకాల పరీక్షలు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం వల్ల పట్టణ పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలని సీఎం నిర్ణయించారన్నారు. అన్ని పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నామని హరీష్ తెలిపారు.