గ్లూకోమ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి: మంత్రి హరీష్

by Sathputhe Rajesh |
గ్లూకోమ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి: మంత్రి హరీష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లూకోమా వ్యాధి చాలా ప్రమాదకరమైనదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చాలా మందిలో వ్యాధి తెలియకుండానే డేంజర్ జోన్ లోకి తీసుకువెళ్తుందన్నారు. కంటి చూపును శాశ్వతంగా కోల్పోతామన్నారు.హైదరాబాద్ లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లూకోమ డే వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు గ్లూకోమా గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. బిపి ,షుగర్ ఉన్నవాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందన్నారు. పని ఒత్తిడి ఉన్న వాళ్లలోనూ ఈ వ్యాధి అధికంగా వస్తుందన్నారు. కంటి చూపు మందగిస్తుంటే నిర్లక్ష్యం వద్దన్నారు. డాక్టర్ లను తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పారు .లేకుంటే చివరకు కంటి చూపును కోల్పోతారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటి బీపీ ,షుగర్ ఉన్నవాళ్లలో 3 శాతం మంది గ్లూకోమా బారిన పడుతున్నారన్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో పది శాతం కంటి చూపును కోల్పోతున్నారన్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రతీ ఏడాది కంటి పరీక్షలు జరుపుకోవాలన్నారు.

సరోజిని దేవి కంటి ఆసుపత్రి పైన త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ప్రపంచంలోనే కంటి వెలుగు లాంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందుతుందన్నారు.కేసీఆరే కిట్ ద్వారా ప్రభుత్వ అసుపత్రుల్లో పెద్ద ఎత్తున డెలివరీ సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు.క రోనా లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుతంగా పని చేశారన్నారు. అక్కడక్కడ వృత్తిలో ప్రాణాలను కూడా కొల్పోయారన్నారు.

ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలను చని పోయిన వారి కుటుంబాలకు అందించామన్నారు.కంటి వెలుగు ద్వారా 5 నెలలు కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తూ మరణించిన ఏ ఎన్ ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ని ఆయన అందించారు.

Advertisement

Next Story

Most Viewed