హరీశ్ రావు ఎంట్రీ ఎప్పుడు.. ఎదురుచూస్తోన్న మునుగోడు నేతలు?

by GSrikanth |   ( Updated:2022-10-14 03:17:48.0  )
హరీశ్ రావు ఎంట్రీ ఎప్పుడు.. ఎదురుచూస్తోన్న మునుగోడు నేతలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ ఉప ఎన్నిక జరిగినా కీలకంగా వ్యవహరించే మంత్రి హరీశ్ రావు.. మునుగోడులో కనిపించడం లేదు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎంట్రీ కాలేదు. మిగతా మంత్రులంతా ప్రచారంలో మునిగినా.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఇద్దరే రాలేదు. మర్రిగూడ ఎంపీటీసీ స్థానం పరిధికి ఇన్‌చార్జిగా ఉన్నా ఇంత వరకు అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు. దీంతో మంత్రి రాక కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. కానీ, హైదరాబాద్ నుంచే అన్నీ చక్కబెడుతున్నట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. నామినేషన్ల విత్ డ్రా అనంతరం నియోజకవర్గానికి వస్తారని పేర్కొంటున్నారు.

సెల్ ఫోన్ ద్వారానే..

ఎన్నికల ప్రచారానికి వెళ్లని మంత్రి హరీశ్ రావు సెల్ ఫోన్ ద్వారానే అన్నీ చక్కబెడుతున్నట్లు తెలిసింది. సొంత పార్టీ లీడర్లను బుజ్జగిస్తూనే, పార్టీకి దూరమైన వారిని, ఇతర పార్టీ లీడర్లకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో కొంతమంది లీడర్లు హైదరాబాద్ కు వచ్చి ఆయన సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

Advertisement

Next Story