Minister Harish Rao: కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా కేసీఆర్ సపోర్టు కావాల్సిందే..

by Javid Pasha |   ( Updated:2023-07-23 14:49:58.0  )
Minister Harish Rao: కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా కేసీఆర్ సపోర్టు కావాల్సిందే..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా కేసీఆర్ సపోర్టు కావాల్సిందేనని స్పష్టం చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని ఆరోపించారు. త్వరలోనే బీజేపీని గద్దెదించుతామని అన్నారు.

Advertisement

Next Story