- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ప్రభుత్వం మాటలకే పరిమితం: Minister Harish Rao
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. నరేంద్ర మోడీ సర్కార్ మాటలు తప్ప పని చేయదని విమర్శలు గుప్పించారు. బుధవారం కుత్భుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఆలోచించలేదని ఆరోపించారు. దేశంలో 10.50 కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే.. వారి సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది కేవలం 0.02 శాతమేనని అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తున్నారని, గిరిజన సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.13,413 కోట్లు(9.5%) కేటాయించుకున్నామన్నారు. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల పేరిట ఎన్నో చేసుకుంటున్నామని, వృత్తిని నమ్ముకున్న వారికోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.