ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: హరీశ్ రావు

by GSrikanth |   ( Updated:2023-04-25 08:17:30.0  )
ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు. కాలేశ్వరం లాంటి ప్రాజెక్టును దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిర్మించిందా? అని ప్రశ్నించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదని విమర్శించారు.

కేంద్రం కాలు అడ్డం పెడుతున్నా అభివృద్ధి ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకెళ్తున్న కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్‌ను తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని మండిపడ్డారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఏం జరగుతుందో.. కేసీఆర్ మీద ఆరోపణలు చేసినా అంతే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన గొప్పోళ్లు అయిపోరు అని సూచించారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు కేసీఆర్ భయపడే రకం కాదని అన్నారు. కేసీఆర్ ఒక ఉద్యమ జ్వాల అని అభిప్రాయపడ్డారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే దమ్ము దేశంలో ఇంకే రాష్ట్రానికైనా ఉందా? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story