- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాయి. కాగా నాలుగో రోజు అసెంబ్లీలో ఆటో కార్మికులు, తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా మొదట అసెంబ్లీలో ఈ వ్యవహారంపై రగడ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు స్కీం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగం అయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎన్ నాయకులు కావాలనే రచ్చ చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. ఆటో కార్మికులపై బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి లేదని.. అందుకు పదేళ్లలో వారి కోసం ఎమ్ చేయలేదని అన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు కేవలం బస్తాండ్ల వద్దకు మాత్రమే వెళ్తున్నాయని.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆటోలనే ఎక్కుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఆటో కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వారికి ప్రతి సంవత్సరం రూ. 12 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి ఆర్థిక సంక్షోభం కారణంగా ఇవ్వలేక పోయామని.. ఖచ్చితంగా త్వరలో ఆటో డ్రైవర్లను తాము ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.