రూ.లక్ష సాయానికి రెండేళ్ల క్రితం ఆదాయ సర్టిఫికెటైనా ఓకే.. మంత్రి గంగుల

by Javid Pasha |   ( Updated:2023-06-12 15:15:30.0  )
రూ.లక్ష సాయానికి రెండేళ్ల క్రితం ఆదాయ సర్టిఫికెటైనా ఓకే.. మంత్రి గంగుల
X

దిశ, తెలంగాణ బ్యూరో : లక్ష సాయానికి ఆదాయ పత్రాలు 2021 ఏప్రిల్ నుంచి జారీ చేసినవి చెల్లుబాటవుతాయని, ఇప్పటి వరకు 53వేల అప్లికేషన్లు వచ్చాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, టాడీ టాపర్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవితో పాటు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులవృత్తులకు ఘన వైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు లక్ష సాయం చేస్తున్నట్లు తెలిపారు. కులవృత్తులకు ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు గానూ ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా లక్ష సహాయం చేస్తున్నామన్నారు. సాయం కోసం ఎవరినీ ప్రత్యక్షంగా కలువాల్సిన అవసరం లేదన్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే ఉండటంతో వెబ్ సైట్ కు దరఖాస్తు దారులు పోటెత్తారు. కలెక్టర్లు ఇన్ కాం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక సైతం కలెక్టర్ల నిర్ణయమే ఫైనల్ అన్నారు. అనంతరం బీసీ హాస్టళ్ల అడ్మిషన్లకు https://bchostels.cgg.gov.in వెబ్ సైట్ ను మంత్రి లాంచ్ చేశారు. రాష్ట్రంలోని 703 బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇకనుంచి ఆన్లైన్ ద్వారానే భర్తీ చేస్తామన్నారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read..

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ..

Advertisement

Next Story