బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకూ కాస్మోటిక్స్.. మంత్రి గంగుల కమలాకర్​

by Javid Pasha |
బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకూ కాస్మోటిక్స్.. మంత్రి గంగుల కమలాకర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్ధులకూ కాస్మోటిక్స్, బెడ్డింగ్ మెటీరియల్, ఉలన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు రానున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ​ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుకునే 34 వేల మంది కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులతో అదనంగా ప్రీమెట్రిక్ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల మాదిరి సౌకర్యాలు అందనున్నాయి. ఈ మేరకు ఏటా రూ.12 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 బీసీ గురుకులాలను ఇప్పటికే 327కు పెంచడగామే కాకుండా.. మహాత్మా జ్యోతీబాపూలే పేరున ఒక్కో విద్యార్థికి 20లక్షల విదేశీ విద్యానిధి, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో చదివే వెనుకబడిన వర్గాల బిడ్డలకు సైతం ఫీజులను చెల్లించబోతున్నామన్నారు.

Advertisement

Next Story